పూరీ-సేతుపతి స్లమ్ డాగ్ టీజర్‌

June 09, 2026


img

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతి చేస్తున్న స్లమ్‌ డాగ్ టెంపుల్ స్ట్రీట్-33 టీజర్‌ విడుదలైంది. సినిమా టైటిల్‌తోనే ఇదొక మురికివాడల్లో నివసించేవారిలో నుంచి వచ్చిన ఓ హీరో కథ అనిదర్శకుడు పూరీ చెప్పేశారు. టీజర్‌లో అదే చూపారు.

మురికివాడలో ప్రజలపై గూండాలు చేసే అరాచకాలను అడ్డుకునే హీరోగా చూపారు. కానీ హీరో గుడ్డివాడనట్లు టీజర్‌ ముగించడం ఆసక్తికరం.       

ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, టాబు, సంయుక్త, దునియా విజయ కుమార్‌, జరీనా వాహబ్, విటివి గణేశ్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: పూరీ జగన్నాథ్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్‌,  కెమెరా: శ్యాం కే నాయుడు,  ఆర్ట్: ఆశిష్ తేజ, జానీ షేక్, ఎడిటింగ్: సంతోష్ నూజిల్లా చేశారు.  

పూరీ, ఛార్మీలు తమ సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తీస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష