దర్శకుడు అనిల్ రావిపూడి స్పీడు మామూలుగా లేదు. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో మల్టీ స్టార్ సినిమాకి నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరుగుతోంది. ఈ నెలాఖరులోగా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చకచకా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు.
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కెమెరా ఆన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టి లాంచనంగా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో వెంకటేష్-కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ క్రుతిశెట్టి జంటగా నటిస్తున్నారు. కీర్తి సురేష్ పసుపు రంగు చీర ధరించగా, క్రుతిశెట్టి ఎరుపు రంగు చీర ధరించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సినిమాకి జీవి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు అనిల్ రావిపూడి ముందే ప్రకటించారు.
#VenkyAnil5 #NKRAR2 Launched Today with Grand Pooja Ceremony
— Taraq(Tarak Ram) (@tarakviews) June 18, 2026
గౌరవ దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు వెంకటేష్ కి ఎలా చెయ్యి వేసి నుంచవాలో చేసి చూపించారు... ఆ సందర్భంలో అక్కడ పేలిన జోక్స్ కి అంతా పగలబడి నవ్వుకున్నారు...
2027 థియేటర్స్ లో పగలబడి నవ్వుకోవడానికి ప్రిపేర్… pic.twitter.com/yilMUhrL0L