నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సలింగ్ ప్రక్రియ షురూ!

June 19, 2026
img

తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కొరకు నేటి నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈసారి కొత్తగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈసారి ఎప్ సెట్ పరీక్షలలో1,44,704 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్ధుల తల్లితండ్రుల వార్షికాదాయం రూ. లోపుగా ఉన్నట్లయితే ఫీజ్ రీఇంబర్స్‌మెంట్‌ లభిస్తుంది. కనుక అర్హులైన విద్యార్ధులు తప్పనిసరిగా తల్లితండ్రుల ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించడం మంచిది. దీనిని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందవచ్చు.    

కౌన్సలింగ్ షెడ్యూల్: 

జూన్‌ 19 నుంచి 29 వరకు: ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవడం 

జూన్‌ 22 నుంచి 29 వరకు : ధ్రువ పత్రాల పరిశీలన 

జూన్‌ 25 నుంచి జూలై 1 వరకు: వెబ్‌ ఆప్షన్స్ ఎంపిక 

జూలై 4:  మాక్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు 

జూలై 5 నుంచి 7 వరకు: వెబ్‌ ఆప్షన్స్ మార్చుకునేందుకు గడువు లేదా కేటాయించిన సీట్లను స్వీకరించడం

జూలై 10: మొదటి విడత సీట్ల కేటాయింపు.

Related Post