బాలయ్య సినిమాలో కాజల్ అగర్వాల్

June 19, 2026


img

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ చేస్తున్న 111వ సినిమాలో ఓ ముఖ్యపాత్రకు కాజల్ అగర్వాల్‌ని ఖారారు చేశారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్‌బీకే 111లోకి స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో ఆమె పోస్టర్ వేశారు. 

ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నయనతార నటిస్తుండగా, మంచు మనోజ్, సముద్రఖని, ఆర్‌.శరత్ కుమార్‌,  ముఖ్యపాత్రలు చేస్తున్నారు. నర్గీస్ ఫఖిరీ ఐటెం సాంగ్‌ చేస్తున్నారు.  

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: తమన్, కెమెరా: అరవింద్. ఎస్. కశ్యప్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 50 శాతంపైగా పూర్తయింది. ఈ ఏడాది డిసెంబర్‌ 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.   


Related Post

సినిమా స‌మీక్ష