మలయాళ సినీ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన ‘ఐ నోబడీ’ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. నిషాం బషీర్ దర్శకత్వంలో ఈ సినిమాలో పార్వతి తిరువత్తు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ ఓ ప్రభుత్వాధికారిగా నటించారు. అనూహ్యంగా ఓ భారీ డబ్బు వివాదంలో చిక్కుకోగా ఓ వైపు పోలీసులు, మరోవైపు విలన్ గ్యాంగ్, మీడియా ఆయన వెంటపడుతున్నట్లు ట్రైలర్‌లో చూపారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇక సినిమా ఎలా ఉంటుందో జూలై 9న విడుదలైతే తెలుస్తుంది.
ఈ సినిమాకు దర్శకత్వం: నిషాం బషీర్, సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: దినేష్ పురుషోత్తం, స్టంట్స్: యానిక్ బెన్, కలి కింగ్ సన్,అమిత్ జాలీ బస్టిన్, ఎడిటింగ్: రమీస్ చేశారు.
పృధ్వీరాజ్ సుకుమారన్ సొంత బ్యానర్ పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్, ఈ4 ఎక్స్‌పెరి మెంట్స్ బ్యానర్లపై ఆయన భార్య సుప్రియ మేనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సావిత్రి కలిసి ఈ సినిమా నిర్మించారు.