తెలంగాణ ఈఏపీసెట్-2026 ఫలితాలు అదివారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలలో ప్రవేశాల కొరకు నిర్వహించిన ఈ నెల్లో నిర్వహించిన పరీక్షలలో ఇంజనీరింగ్ కోర్సులకు మొత్తం 1,97,241 మంది, అగ్రికల్చర్ కోర్సులకు 84,954 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. పరీక్షలు నిర్వహించిన ఆరవ రోజునే ప్రాధమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫలితాలు ప్రకటించారు.
ఈ ప్రవేశ పరీక్షలలో ఉప్పల్‌కు చెందిన రుషిక్ మొదటి ర్యాంక్ సాధించగా, మూసాపేటకు చెందిన అన్షుల్, ఏపీలో పులివెందులకు చెందిన ఎం.వంశీధర్ రెడ్డి వరుసగా రెండు, మూడు ర్యాంకులు సాధించారు.
నేడు ప్రకటించిన ఫలితాలలో ర్యాంకుల ఆధారంగా త్వరలో మూడు కోర్సులకు కౌన్సిలింగ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఫలితాల కోసం http://eapcet.tgche.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.