నేడు మిడ్జిల్‌కి సిఎం రేవంత్ రెడ్డి

July 04, 2026


img

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చి నేటికి సరిగ్గా 20 ఏళ్ళు. ఈ సందర్భంగా అయన తన రాజకీయ జీవితంలో మొదటి మెట్టుగా నిలిచిన మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్ గ్రామానికి ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్ళారు. ముందుగా సోషల్ మీడియాలో తన 20 ఏళ్ళ ప్రస్తానం గురించి భావోద్వేగంతో కూడిన ఓ సందేశం పెట్టారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శ్రామికుడుగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని దానిలో హామీ ఇచ్చారు. 

2006, జూలై 4న మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలవడంతో రాజకీయ ప్రస్తానం మొదలైంది కనుక ఆ గ్రామ, మండల ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞలు తెలుపుకునేందుకు ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. 

ముందుగా నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం, ఊర్కొండ పేట గ్రామంలో నాడు దర్శించుకున్న ఆంజనేయస్వామిని నేడు మరోసారి దర్శించుకుని తర్వాత ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 

అక్కడే ఆనాడు తనతో కలిసి పనిచేసిన నేతలు, కార్యకర్తలతో సిఎం రేవంత్ రెడ్డి కాసేపు మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. తన రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసిన మిడ్జిల్ మండల ప్రజల రుణం తీర్చుకునేందుకు పలు అభివృద్ధి పనులకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.    


Related Post