తెలంగాణ యువతకు ఆంధ్రాలో ఉద్యోగాలు ఇస్తారా? కవిత ప్రశ్న

July 03, 2026


img

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల సోమాజీ ప్రెస్‌ క్లబ్‌లో ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుతూ, “ఆంధ్రాలో పుట్టి ఇక్కడ చదువుకున్న ఆంధ్రా పిల్లలకు మనం ఉద్యోగాలు ఇస్తున్నాం. కానీ ఇక్కడ పుట్టి ఆంధ్రాలో చదువుకున్న తెలంగాణ పిల్లలకి ఆంధ్రాలో ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వరు కదా?మరి అలాంటప్పుడు ఇక్కడ ఆంధ్రా పిల్లలకి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలి మనం? అనేది నా ప్రశ్న. 

మరో విషయం ఏమిటంటే, ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ‘లోకల్’గా పరిగానిస్తున్నాము. కానీ మన తెలంగాణ పిల్లలు వేరే రాష్ట్రాలలో చదువుకొని తెలంగాణకు వస్తే వారిని ‘నాన్ లోకల్’ అని పక్కన పెట్టేస్తున్నాము. ఇదెక్కడి న్యాయం?” అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.


Related Post