యూట్యూబ్‌లో కన్నప్ప.. ఎందుకప్పా?

July 03, 2026


img

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్  ‘కన్నప్ప’ గత ఏడాది జూన్‌ 27న థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ ఒక్క సినిమాతో మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరూ చాలా నష్టపోయినట్లు గుసగుసలు వినిపించాయి.

సినిమా ఎలా ఉన్నప్పటికీ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. కన్నప్ప కూడా అలాగే గత ఏడాది సెప్టెంబర్‌ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం అవుతుందని ప్రకటించారు. కానీ రాలేదు. హిందీ వెర్షన్ మాత్రం వచ్చింది.

తెలుగుతో సహా మిగిలిన దక్షిణాది భాషల్లో నేటికీ ఓటీటీలో విడుదల కాలేదు. బహుశః ఓటీటీ డీలిమిటేషన్‌ కుదరకపోవడం వలన లేదా ఇతరత్రా కారణాల వలన నేటికీ కన్నప్ప ఓటీటీలోకి రాలేదు. 

ఈ నేపధ్యంలో మంచు విష్ణు కనప్పని తన సొంత యూట్యూబ్ ఛానల్‌ ఆవా ఎంటర్‌టైన్మెంట్‌లో నేటి నుంచి ప్రేక్షకులాక్ అందుబాటులోకి తీసుకువచ్చారు. 

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంక్లో వచ్చిన ఈ సినిమాలో మంచు విష్ణు శివభక్తుడు కన్నప్పగా నటించగా ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి అగ్రనటీనటులు కీలక పాత్రల్లో నటించారు.

ఇంత భారీ పెట్టుబడితో ఇంతమంది అగ్రనటులతో తీసినా కన్నప్ప ప్రేక్షకులకు నచ్చలేదు.  కనీసం యూట్యూబ్‌లోనైనా కన్నప్పని ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష