స్పీడ్ పోస్టుని అలా కూడా వాడేసుకుంటున్నారు

July 03, 2026
img

స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా గంజాయి డోర్‌ డెలివరీ చేస్తున్న సంగతి హైదరాబాద్‌ పోలీసులు గుర్తించారు. జార్ఖండ్ కేంద్రంగా ఇది జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని కోసం వినియోగదారుల నుంచి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్స్ తీసుకుంటున్నట్లు గుర్తించారు.

సదరు ముఠా స్థానికంగా పండించిన గంజాయిని వినియోగదారుల ఆర్డర్స్ మేరకు చిన్న చిన్న ప్యాకెట్లలో స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తుంది. గంజాయి ఎన్ని గ్రాములు కావాలనే తెలియజేసేందుకు ‘మ్యాంగో’ వంటి కోడ్స్ వినియోగిస్తున్నారు.

జార్ఖండ్ నుంచి దేశంలో 21 రాష్ట్రాలకు స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రోజుకు 80 నుంచి 100 వరకు ఆర్డర్లు చొప్పున ఏడాదికి సుమారు రూ.4-5 కోట్ల విలువ గల గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులు అంచనా వేశారు.

ఇంత బహిరంగంగా, ఇంత విస్తృతంగా గంజాయి సరఫరా, వ్యాపారం జరుగుతుండటం గమనిస్తే రైల్వే, పోస్టల్ సర్వీసులలో మరింత ఆధునికమైన స్కానింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరమని స్పష్టమవుతోంది. 

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="en" dir="ltr">Hyderabad, Telangana: Police Commissioner VC.Sajjanar says, &quot;Hyderabad Narcotics Enforcement Wing, today we have busted a nationwide door step delivery Ganja network which was being operated from Jharkhand and being supplied to 21 states through the official channel India Post,… <a href="https://t.co/nHQl3N48Xr">pic.twitter.com/nHQl3N48Xr</a></p>&mdash; IANS (@ians_india) <a href="https://x.com/ians_india/status/2072694946562511200?ref_src=twsrc%5Etfw">July 2, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

Related Post