తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.
ఈ ప్రాజెక్టు తొలి దశలో రూ.7,345.12 కోట్లతో 21 కిలోమీటర్ల మేర చేపట్టనున్న అభివృద్ధి పనులు చేప్పటేందుకు ఆమోదం తెలిపింది. దీనిలో సుమారు రూ. 4,000 కోట్లు రుణాల ద్వారా సమీకరించుకొని మిగిలిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సమకూర్చుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
మరో విశేషమేమిటంటే ఈ ప్రాజెక్టు పనుల కోసమే ప్రత్యేకంగా 147 కొత్త పోస్టులను కూడా మంజూరు చేశారు.
ఇక హైదరాబాద్‌లోని సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్ మరియు వరంగల్లో అందుబాటులోకి రాబోతున్న ‘టిమ్స్’ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం మొత్తం 6,278 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
వీటిలో ఈ నియామకాలలో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, 4,235 అవుట్‌సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ దాదాపు నిరంతరంగా కొనసాగిస్తోంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో నిరుద్యోగులకు మరోసారి గొప్ప అవకాశం కల్పించినట్లయింది.