తిరుమల గురించి మాట్లాడినవారు... అయోధ్య గురించి మౌనమేల?

June 28, 2026


img

జగన్మోహన్ రెడ్డి హయంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ చాలా మాట్లాడారు. కానీ అయోధ్య రామాలయ నిర్మాణానికి వచ్చిన నిధుల దుర్వినియోగం, ఆలయంలో వరుస దొంగతనాల గురించి ఎందుకు మౌనం పాటిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వారిరువురినీ సూటిగా ప్రశ్నించారు.

తిరుమల లడ్డూ కల్తీ విషయంలోభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు మాట్లాడినప్పుడు, అయోధ్య ఆలయంలో జరుగుతున్న దొంగతనాల వలన కూడా భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని భావించడం లేదా? అని కె.రామకృష్ణ ప్రశ్నించారు.

టీడీపి, జనసేనలు బిజేపితో కలిసి ఉన్నందునే అయోధ్య రామాలయం గురించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ నోరు మెదపడం లేదని, ఇది సరికాదని కె.రామకృష్ణ అన్నారు. 


Related Post