తెలుగు ప్రేక్షకులకు మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథలంటే ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తే. ఇప్పుడీ జోనర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘తత్వం’. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
అర్జున్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దినేష్ తేజ్, దశ్విక కింతల్లి జోడీగా చేస్తున్నారు. భోగిరెడ్డి శ్రీనివాస్, ప్రమోదిని జీన్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
“కొన్ని పోరాటాలు విధి కోసం.. కొన్ని న్యాయం కోసం” అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఓ యువకుడు పెళ్లిచూపుల కోసం గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ఆ గ్రామంలో జరిగిన వరుస హత్యల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? అసలు నిందితుడు ఎవరు? అంటూ చేసిన ట్రైలర్ కట్ ఆసక్తికరంగా ఉంది.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: అర్జున్ కోలా, సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: మల్లిఖార్జున్ దేవరగట్ల, బోడుపల్లి నరేష్, ఎడిటింగ్: విప్లవ్ నైషాదం, ఆర్ట్: శివ చేశారు.
ఈ సినిమాని ఎస్‌కే ప్రొడక్షన్స్, త్రాయతి ఇషాని క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి నిర్మిస్తున్నారు.