ప్రియదర్శి ఇడుపు కాయితం ఫస్ట్ లుక్ పోస్టర్‌

June 26, 2026


img

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి మరో ఆసక్తికరమైన కథతో ‘ఇడుపు కాయితం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమాలో ప్రియదర్శికి జంటగా నాగదుర్గని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. ఇడుపు కాయితం ఫస్ట్ లుక్ పోస్టర్‌ చాలా సహజంగా, అద్భుతంగా ఉంది.  

తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే దానినే ‘ఇడుపు కాయితం’గా పేర్కొంటారు. కనుక ఇది భార్యాభర్తల అనుబంధం, కుటుంబ సంబంధాలు, వారు విడిపోయే పరిస్థితిలో కుటుంబంలో నెలకొనే భావోద్వేగాలు ఈ సినిమాలో చూపబోతున్నట్లు భావించవచ్చు. 

సుకుమార్ రైటింగ్స్, బీవీ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వంశీ రెడ్డి దొండపాటి, సురేష్ బొబ్బిలి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష