ప్రస్తుతం సింగిల్: శ్రుతి హాసన్

June 25, 2026


img

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రుతి హాసన్ వయసు 40 ఏళ్ళు. నేటికీ పెళ్ళి చేసుకోలేదు. కనుక ఆమె పేరుని ఎవరో ఒకరితో ముడిపెడుతూ అతనితో ఆమె రిలేషన్ షిప్‌లో ఉన్నారంటూ తరచూ ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. మీడియా ప్రతినిధులే మళ్ళీ వాటిపై ఆమెని వివరణ కోరుతుంటారు. అలాగే మరోసారి ఎవరితోనైనా రిలేషన్ షిప్‌లో ఉన్నారా? అంటూ ఇటీవల ఓ అభిమాని అడిగారు. 

వారికి జవాబిస్తూ “నేను ఎవరితోనూ రిలేషన్ షిప్‌లో లేను. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను. ప్రస్తుతం నేను నా కెరీర్, నా వ్యక్తిగత అభిరుచులపైనే దృష్టి పెట్టాను. ఒకవేళ నేను ఎవరితోనైనా రిలేషన్ షిప్‌లో ఉన్నా, ఎవరినైనా పెళ్ళి చేసుకోబోతున్నా నేనే ఆ విషయం చెప్తాను. కనుక నా వ్యక్తిగత జీవితం గురించి దయచేసి ఎవరూ పుకార్లు నమ్మవద్దు,” అని శ్రుతీ హాసన్ విజ్ఞప్తి చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష