హర్ష రోహాన్, నక్షత్ర జోడీగా చేస్తున్న సినిమా పేరు తెల్ల కాగితం. రమేష్ బండ్రేడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ సినిమా నుంచి చిలుక అంటూ సాగే పాట ప్రమో నిన్న విడుదలైంది. పూర్తిపాట ఈరోజు సాయంత్రం విడుదల కాబోతోంది. పూర్ణాచారి వ్రాసిన ఈ పాటని విజయ్ బుల్గానిన్ స్వరపరిచి సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు.
ఈ సినిమాలో దీపక్, అజయ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: నందు సవిరిగన, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: కేవీ గుహన్, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్: ఆర్. కార్తీక శ్రీనివాస్ చేశారు.