సుజీత్ దర్శకత్వంలో చేసిన ‘ఓజీ’ సూపర్ హిట్ అయినప్పుడే దాని సీక్వెల్ చేస్తానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. కానీ ఓ పక్క ఏపీ డెప్యూటీ సిఎం, మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తూ క్షణం తీరిక లేని జీవితం గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఓజీ సీక్వెల్ చేయగలరా? అని అప్పుడే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ దర్శకుడు సుజీత్ ఓజీ సీక్వెల్‌కి అప్పుడే కథ సిద్దం చేసి పవన్ కళ్యాణ్‌కి వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కనుక ఓజీ-2కి సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఈసారి ‘ఓజీ-2’ని డీవీవీ దానయ్య బదులు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ అయనకు ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చినందున ‘ఓజీ-2’ అవకాశం ఆయనకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై డీవీవీ దానయ్య స్పందన ఇంకా తెలియాల్సి ఉంది.