జానకీ రామ్ మారెళ్ళ దర్శకత్వంలో శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఒరియా పిల్ల అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. భాస్కరభట్ల వ్రాసిన ఈ పాటకి విజయ్ బుల్‌గనిన్ సంగీతం అందించగా సిద్ శ్రీరాం హుషారుగా పాడారు.
ఈ సినిమాలో మోస్ట్ వాంటడ్ మావోయిస్టుగా శ్రీవిష్ణు అతనికి జోడీగా మహిమా నంబియార్ నటిస్తున్నారు. రాధికా శరత్ కుమార్, షైన్ టాం చాకో, ఉప్రేంద్ర లిమాయే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు దర్శకత్వం: జానకీ రామ్ మారెళ్ళ, కధ: భాబు భోగవరపు, డైలాగ్స్: నందు సరవిగాన, సంగీతం: విజయ్ బుల్‌గనిన్, ఎడిటింగ్: చోటా కే ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్ చేస్తున్నారు.
స్కందవాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కుమారి కర్నాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కామ్రేడ్ కళ్యాణ్ ఆగస్ట్ నెలలో విడుదల కాబోతోంది.