జానకీ రామ్ మారెళ్ళ దర్శకత్వంలో శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ నుంచి ఒరియా పిల్ల అంటూ సాగే పాట పరమో విడుదలైంది. పూర్తిపాట శనివారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల కాబోతోంది.
ఈ సినిమాలో మోస్ట్ వాంటడ్ మావోయిస్టుగా శ్రీవిష్ణు, అతనికి జోడీగా మహిమా నంబియార్ నటిస్తుండగా, రాధికా శరత్ కుమార్, షైన్ టాం చాకో, ఉప్రేంద్ర లిమాయే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు దర్శకత్వం: జానకీ రామ్ మారెళ్ళ, కధ: భాబు భోగవరపు, డైలాగ్స్: నందు సరవిగాన, సంగీతం: విజయ్ బుల్‌గనిన్, ఎడిటింగ్: చోటా కే ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్ చేస్తున్నారు.
స్కందవాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కుమారి కర్నాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
This melody is about to take over your playlists ▶️#ComradeKalyan 1st Song - #OriyaPilla Promo Out Now 🎶🤩
— Kona Film Corporation (@KonaFilmCorp) June 19, 2026
Full Song Releasing Tomorrow at 4.05 PM 💥
Music by @VijaiBulganin 🎻
IN THEATERS THIS 2026..!!@sreevishnuoffl @Mahima_Nambiar @konavenkat99 #JanakiRamMarella pic.twitter.com/EfaUnEenKb