విరాట్ కర్ణ, నభ నటేష్ ప్రధాన పాత్రలలో ‘నాగ బంధం’ ట్రైలర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది.
అత్యంత మహిమాన్వితమైన బ్రహ్మ కమలం దక్కించుకునేందుకు దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నాలను దైవిక శక్తుల సాయంతో హీరో ఏవిధంగా అడ్డుకున్నాడనేది ఈ సినిమా కథని ట్రైలర్‌లో చూపారు.
సోషియో ఫ్యాంటసీ సినిమాలలో గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్ చాలా కీలకం. ఈ మూడు అద్భుతంగా కుదిరినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.
అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగబంధంలో ఐశ్వర్యా మీనన్, మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు, దక్ష నాగర్కర్, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా, కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: జునైద్ కుమార్, అబే, నేపథ్య సంగీతం: జునైద్ కుమార్, ఎడిటింగ్: ఆర్ సి ప్రణవ్, డైలాగ్స్: శ్రావణ్ కుమార్ తడ్క, యాక్షన్: కనల్ కన్నన్, వ్లాడ్ రింబర్గ్, (అమెరికా), రియల్ సతీష్, కేచా ఖాంఫక్దీ, నందు, రన్ నవారాచ్ (థాయిలాండ్), జూనియర్ వెంకట్, , కొరియొగ్రఫీ: బృంద, గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ చేశారు.
లక్ష్మీ ఐరా మరియు దేవాంశ్ నామా సమర్పణలో నిక్ స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి కలిసి 5 భాషల్లో ఈ సినిమా నిర్మించిన నాగ బంధం జూలై 3న విడుదల కాబోతోంది.