గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా ‘టాక్సిక్’ (సబ్ టైటిల్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్) ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం పడుతుందని జూన్ 4న వాయిదా వేసుకున్నారు. కానీ అదే రోజున దురంధర్-2 విడుదలవుతుండటంతో మరోసారి వాయిదా పడింది.
రెండు వాయిదాల తర్వాత తాజాగా ఆగస్ట్ 26న విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ‘హానర్ ధై ఫాదర్’ అంటూ కొత్త పోస్టర్ వేసి ఆగస్ట్ 26న విడుదల చేయబోతున్నట్లు టాక్సిక్ చిత్ర బృందం ప్రకటించింది.
‘టాక్సిక్’లో నయనతార, కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ ఐదుగురు హీరోయిన్లు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.
Honour Thy Father...#Toxic In Cinemas Worldwide from 26-08-2026#ToxicTheMovie#Nayanthara @advani_kiara #TaraSutaria@humasqureshi @rukminitweets #GeetuMohandas @VishalMMishra #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar… pic.twitter.com/oAlW0JdldO