ఒకేరోజు మూడు యుద్ధనౌకలు జల ప్రవేశం

June 22, 2026
img

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌ నావికాదళంలోకి ఎప్పటికప్పుడు కొత్త యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు ప్రవేశపెడుతూనే ఉంది. అవన్నీ దేశీయంగా తయారైనవే. ప్రతీయుద్ధ నౌక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, విద్వంసరకరమైన క్షిపణి సామర్ధ్యంతో కూడుకున్నవే. 

భారత్‌ నావికాదళానికి గత రెండు, మూడు, నాలుగేళ్ళుగా సేవలు అందిస్తున్న మూడు యుద్ధ నౌకలను ఆధునీకరించి  ప్రధాని మోడీ కోల్‌కత్తాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో  జాతికి అంకితం చేశారు.        

వీటిలో ఐఎన్ఎస్ దుణగిరి (2022 జూలై), ఐఎన్ఎస్ సంశోధక్ (2023 జూన్), ఐఎన్ఎస్ అగ్రయ్‌ (2024 మార్చి) నుంచి నావికాదళంలో ఉన్నాయి. ఈ మూడు అత్యాధునిక యుద్ధనౌకలు వేటికవే సాటి. అయినప్పటికీ అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీతో వీటిని అప్‌డేట్‌ చేసి, పునర్నిర్మించి జాతికి అంకితం చేశారు. 

ఐఎన్ఎస్ దుణగిరి: అడ్వాన్స్‌డ్‌ గైడడ్‌ మిసైల్, బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించవచ్చు. 

ఐఎన్ఎస్ సంశోధక్: సముద్ర జలాలలో మార్గాలు, నావిగేషన్, విపత్కర సమయాలలో సహాయ చర్యలు, ముఖ్యంగా సముద్ర స్థితిగతుల అధ్యయనం చేయడానికిగాను దీనిలో అత్యాధునిక పరికరాలతో నిర్మించారు.

ఐఎన్ఎస్ అగ్రయ్‌: ఇది శత్రు దేశాల సబ్ మెరైన్ల కదలికలను పసిగట్టి వాటిపై దాడి చేసి ధ్వంసం చేయగలదు. అలాగే శత్రువుల యుద్ధ విమానాలను కూడా పసిగట్టి యుద్ధ విమానాలతో సమన్వయం చేసుకోగలదు. సముద్రం ఉపరితలం మీద శత్రు నౌకలను సమర్ధంగా ఎదుర్కోగలదు.        


Related Post