బీఆర్ఎస్‌.. ఇవిగో అభివృద్ధి పనుల జాబితా!

June 09, 2026


img

రూ.1,674 కోట్లు వ్యయంతో మియాపూర్ పరిధిలో సిఎం రేవంత్ రెడ్డి చేసిన శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలే బీఆర్ఎస్‌ పార్టీ విమర్శలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తున్న సమాధానంగా భావించవచ్చు.  

రూ.65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి సిఎం రేవంత్ రెడ్డి శంకు స్థాపన చేశారు. దీని కోసం రూ.161 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 

మియాపూర్ చౌరస్తాలో రూ. 530 కోట్లు వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. 

రూ.308 కోట్లతో శేరిలింగంపల్లి ROB నిర్మాణ పనులకు శంకుస్థాపన

రూ.229 కోట్లతో ORRకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన నిర్మాణం, ORR నుండి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన.

29.25 కోట్లతో కొల్లూరు ఇంటర్‌చేంజ్ సమీపంలోని రెండు రైల్వే ఓవర్ హెడ్స్ (RoBs) వరకు 4 లేన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి శంకుస్థాపన

రూ.26.50 కోట్లతో నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ORR ఎడమ వైపు ఉన్న ప్రధాన క్యారేజ్ వే విస్తరణకు శంకుస్థాపన.

రూ. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన.

రూ.110 కోట్లతో శంకర్ పల్లి రోడ్ MGIT నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.

రూ.14.40 కోట్లతో మాదాపూర్‌, నానక్ రామ్ గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన.


Related Post