రేపు చేప ప్రసాదం పంపిణీ.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

June 07, 2026
img

ఏటా బత్తిన సోదరులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది రేపు (జూన్‌ 8) పంపిణీ చేయబోతున్నారు. దీని కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్-జిహెచ్‌ఎంసి, విద్యుత్, మత్స్య తదితర శాఖల సమన్వయంతో సకల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి చేప మందు కోసం వచ్చిన, వస్తున్నవారితో చుట్టుపక్కల హోటల్స్‌, ఖాళీ స్థలాలు కిటకిటలాడుతున్నాయి. చేప ప్రసాదం కోసం ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ల వద్ద రోగులు, వారి సహాయకులు బారులు తీరారు. 

కనుక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మీదుగా రాకపోకలు సాగించేవారు ఈ రెండు రోజులు ఇతర మార్గాల గుండా గమ్యస్థానాలు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

నాంపల్లి, ఛాదర్ ఘాట్, అబీడ్స్ వైపు నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఇతర మార్గాలలోకి మళ్ళించబోతున్నారు. 

ఆర్టీసీ బస్సులు, కార్లలో వచ్చేవారు గాంధీభవన్, గృహకల్ప బస్టాపుల నుంచి నడిచి రావాలని ట్రాఫిక్ పోలీస్ సూచించారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలలో వచ్చేవారి కోసం షేజాన్ హోటల్ వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు. అక్కడ దిగి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు నడిచి రావాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. 

Related Post