అవినీతిపరులు తెలంగాణని దోచేస్తున్నారే!

June 23, 2026
img

తెలంగాణ ప్రభుత్వ శాఖలలో ఉన్నతస్థాయిలో ఉన్న కొందరు అధికారులు అందినకాడికి దోచేస్తున్నారు. ఇటీవల నరహరి అనే అవినీతి అధికారి ఇంట్లో వందల కోట్లు విలువగల బంగారం, నగదు, స్థిర చరాస్తులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

నేడు నిజామాబాద్‌ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ కే. మల్లారెడ్డి, అయన బంధుమిత్రులు, బినామీల ఇళ్ళపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఒకే సమయంలో 11 బృందాలు వేర్వేరు ప్రాంతాలలో సోదాలు నిర్వహించి భారీగా నగదు, వెండి బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

మల్లారెడ్డి హైదరాబాద్‌లోని మాచ బొల్లారంలోని మల్లారెడ్డి నివాసంతో పాటు, నిజామాబాద్‌ జిల్లాలో అయన ఇల్లు, కార్యాలయాలపై ఏక కాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఇంకా సోదాలు కొనగుతున్నాయి. స్వాధీనం చేసుకున్నవాటి విలువ లెక్కకట్టిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. 

Related Post