మమతా బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్‌ షాక్

June 23, 2026


img

పదిహేనేళ్ళపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించి, రాష్ట్ర రాజకీయాలను శాశించిన మమతా బెనర్జీకి ఆమె సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే పెద్ద షాక్ ఇచ్చారు. 

ఇటీవల పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో బిజేపి చేతిలో ఆమె పార్టీ ఓడిపోగానే, ఆ ఎన్నికలలో మొత్తం 80మంది ఎమ్మెల్యేలు గెలవగా వారిలో 59మంది తిరుగుబాటు చేసి వేరు పడ్డారు. 

సోమవారం కోల్‌కత్తాలో జరిగిన సమావేశంలో వారితో పాటు జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. 

వారు మమతా బెనర్జీని అధ్యక్ష పదవిని తొలగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆమె స్థానంలో ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ని పార్టీ చైర్ పర్సన్‌గా ఎన్నుకున్నారు.

ఇకపై తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ తమదేనని, పార్టీతో మమతా బెనర్జీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. ఒకవేళ ఆమె కావాలనుకుంటే తమ పార్టీలో ప్రధాన సలహాదారుగా చేరవచ్చని అరూప్ రాయ్‌ అన్నారు.

ఇంతకాలం పార్టీ జెండా, కండువాలలో మమతా బెనర్జీ బొమ్మ ఉండేది. దానిని వారు తొలగించి కేవలం తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ అధికార చిహ్నం మాత్రం ఉంచారు.


Related Post