టాలీవుడ్‌లో దివ్వెల మాధురి ఎంట్రీ

June 23, 2026


img

ఏపీ, శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని పాపులర్ అయిన దివ్వెల మాధురి, బిగ్ బాస్-9లో చేసిన హడావుడి అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది.

ఇప్పుడు ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. దివ్వెల మాధురి అందంగా ఉంటారు. మంచి డాన్సర్. రీల్స్ కూడా చేస్తుంటారు. పైగా నిత్యం ఏదో ఓ వివాదంలోనే ఉంటారు. కనుక అంతగా పాపులర్ అయిన ఆమె టాలీవుడ్‌లో ప్రవేశం పెద్ద విచిత్రం కాదు.

గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కుతున్న‘చీన్ టపాక్ డుం డుం’ కామెడీ సినిమాలో దివ్వెల మాధురి ‘గైరమత్త’గా నటిస్తున్నారు. శుభం, కుమారి శ్రీమతి సినిమాలలో హీరోగా నటించిన గవిరెడ్డి శ్రీనివాస్, బ్రిగిడా సాగా ఈ సినిమాలో జంటగా నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టి హైదరాబాద్‌, నర్సీపట్నం కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించారు.

విలేజ్ టాకీస్ బ్యానర్‌పై నాగులపల్లి శ్రీను నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.     


Related Post

సినిమా స‌మీక్ష