లెనిన్: కొన్ని సన్నివేశాలు రీషూట్?

June 23, 2026


img

అక్కినేని వారసుడు అఖిల్ తాజా చిత్రం ‘లెనిన్ ఈ నెల 26న విడుదల కావాల్సి ఉండగా జూలై 10కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఫైనల్ వెర్షన్ వేసుకొని చూసినప్పుడు దర్శక నిర్మాతలు, అఖిల్ కూడా కొన్ని సన్నివేశాలు మార్చడం కొన్ని రీషూట్ చేసి మెరుగుపరచడం అవసరమని భావించారు. వాటిలో ఒక పాట మొత్తం పక్కన పెట్టేసి మళ్ళీ రీషూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రీ షూటింగ్‌ వలననే సినిమా ఆలస్యమైనట్లు చిత్ర బృందం తెలియజేసింది.       

మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేస్తున్న ‘లెనిన్’ గ్రామీణ నేపధ్యంలో సాగే ఓ రొమాంటిక్ కమర్షియల్ సినిమా. 

ఈ సినిమాకి సంగీతం: తమన్, కెమెరా: ఐ నవీన్ కుమార్‌, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

అన్నపూర్ణా స్టూడియోస్, సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మనం ఎంటర్‌ప్రైజస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై అక్కినేని కుటుంబం, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు. జూలై 10న లెనిన్ విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష