సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ విడుదలైంది. గ్రామంలో ‘సెక్స్ ఎడ్యుకేషన్’ భోదించేచడం అనే చిన్న పాయింటు కావాల్సినంత వినోదం అందిస్తుందని వేరే చెప్పక్కరలేదు. ట్రైలర్‌లో అదే చూపారు.
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీశర్మ, బ్రహ్మానందం, రఘుబాబు, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ వెబ్ సిరీస్‌కు కథ: మల్లిక్ రామ్, రమేష్ ఎలిగేటి, శివాని దోభల్, సంగీతం: అనుదీప్ దేవరకొండ, కెమెరా: ఎజే ఆరోన్, ఎడిటింగ్: విప్లవ న్యాషడం చేశారు.
చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్, లక్ష్మీపతి కలిసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ప్రసారం కాబోతోంది.