సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ‘ఓజీ’కి సీక్వెల్ గురించి అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్‌ని కలిసి ఓజీ సీక్వెల్ స్టోరీ వివరిస్తున్నప్పుడు తీసిన ఓ వీడియోని విడుదల చేశారు. ఓజీ సీక్వెల్ గురించి సుజీత్ చెప్పింది విన్న తర్వాత సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లు దానిలో చూపారు.
ఊహించని విధంగా వచ్చిన ఈ వీడియోని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. ఓ పక్క ఏపీ డెప్యూటీ సిఎంగా, మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తూ క్షణం తీరిక లేని జీవితం గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఓజీ సీక్వెల్ చేయగలరా? అని అనుమానాలు వ్యక్తమవుతుంటే, చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఆ అనుమానాలు తొలగిపోయాయి.
అయితే ఈసారి ‘ఓజీ-2’ని డీవీవీ దానయ్య బదులు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ అయనకు ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చినందున ‘ఓజీ-2’ అవకాశం ఆయనకు ఇచ్చినట్లు తెలుస్తోంది.