నదీ జలాల కోసం కీచులాడుకుంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల సిఎంలను కర్ణాటకలో తుంగభద్రా నది కలిపింది. గత ఏడాది వరదల సమయంలో 19వ గేటు కొట్టుకుపోయింది. మరికొన్ని గేట్లు కూడా దెబ్బ తిన్నాయి. వాటి స్థానంలో తుంగభద్ర ప్రాజెక్టుకి కొత్తగా 33 గేట్లు అమర్చారు.
హొస్పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో వీటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సిఎం డీకే శివకుమార్ హాజరవడం విశేషం. ముగ్గురూ కలిసి గేట్లను లాంచనంగా ప్రారంభించారు. వీరితో పాటు మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా హాజరయ్యారు.
తుంగభద్ర జలాలలో తెలంగాణ వాటాని కాపాడుకుంటానని సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున తెలంగాణకు సంపూర్ణ సహకారం లభిస్తుంది.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “దశాబ్దాలుగా తుంగభద్ర నదీ జలాలపై కొనసాగుతున్న అంతర్ రాష్ట్ర వివాదాలను ఈ శుభ సందర్భంగా శాస్వితంగా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను. నదీ జలాల విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చాలా చురుకుగా స్పందించి చర్యలు తీసుకుంటారు. అయన చొరవతో ఈ నదీ జలాల వివాదాలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను,” అని అన్నారు.