ఈ డాక్టర్‌... చాలా డేంజరా?

June 25, 2026


img

సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలుపెట్టిన కొత్త చిత్రం ‘ధర్మన్’ మేకింగ్ వీడియో రిలీజ్‌ చేశారు. ధర్మన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే చాలా స్టైలిష్‌గా కనిపించిన రజినీ, ధర్మన్‌గా ఎలా మారారో ఈ వీడియోలో చూపారు. ముఖ్యంగా మేకప్, ఫోటో షూట్, లుక్ డిజైన్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

ఈ సినిమాలో అసాంఘిక శక్తులకు తగిన ట్రీట్‌మెంట్ ఇచ్చి గాడిన పెట్టే వైద్యుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక రజినీ సినిమాకు అవసరమైన మాస్ ఎలిమెంట్స్‌ అన్నీ ధర్మన్‌లో ఉంటాయని ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే స్పష్టమైంది. సిమ్రాన్,  రాశీఖన్నా ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేయబోతున్నారు.

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మన్, ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్, చేస్తున్నారు. 

అశ్వత్థ ముత్తు దర్శకత్వంలో అయన సొంత బ్యానర్ అశ్వత్థ ముత్తు ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్‌.మహేంద్రన్ కలిసి ధర్మన్ నిర్మిస్తున్నారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/tpEe10R1f0Y?si=rI7PyYep5OipqTAk" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష