అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’ లో రష్మిక మందన కూడా చేయబోతున్నట్లు చాలా రోజుల నుంచే వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనని తెలుస్తోంది. ఈ సినిమాలో అధిక భాగం ముంబాయి చుట్టుపక్కలే షూటింగ్ జరుగుతోంది.
త్వరలో ప్రారంభం కాబోయే కొత్త షెడ్యూల్లో రష్మిక మందన కూడా పాల్గోనబోతున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాలో దీపికా పడుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ, బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ ఏడాది డిసెంబర్‌లోగా షూటింగ్ పూర్తి చేసి 2027 వేసవిలో రాకా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో 9 భారతీయ భాషల్లో రాకా నిర్మిస్తున్నారు.