ఇప్పుడు సినిమాలతో పోటీగా ఓటీటీలో నేరుగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్ కోసం వినోద్ గాలి దర్శకత్వంలో రూపొందించిన ‘గుర్తుకొస్తున్నాయి’ కామెడీ వెబ్ సిరీస్ జూలై 3 నుంచి ప్రసారం కాబోతోంది. కనుక ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.
త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న ఓ యువకుడు ప్రమాదంలో జ్ఞాపకాలన్నీ మరిచిపోతే పరిస్థితి ఏమిటి? వాటిని తిరిగి పొందే అవకాశం లభిస్తే... ఆ యువకుడి జీవితం ఏవిధంగా సాగింది? అనేది వెబ్ సిరీస్ మూల కథ.
విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్‌లో రోహిణి హట్టంగడి, ప్రియదర్శిని రామ్, పవన్ సిద్ధూ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.