కొత్త దర్శకుడు ఉద్భవ్ దర్శకత్వంలో అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా చేస్తున్న ‘వీసా.. వింటారా సరదాగా’ నుంచి ‘చింగారి’ లిరికల్ వీడియో సాంగ్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. సనారే వ్రాసిన ఈ పాటకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా, సిద్ శ్రీరాం, లిప్సిక కలిసి మృదు మధురంగా పాడారు.
అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలని కోరుకునే భారతీయ యువత కలల చుట్టూ అల్లుకున్నదే ఈ కథ. ఈ సినిమాలో శ్రీగౌరీ ప్రియ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: విజయ్ బుల్గానిన్ అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.