బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ ఈ నెల 5న ముచ్చటగా మూడో పెళ్ళి చేసుకోబోతున్నారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో తన ఇంట్లోనే ఆత్మీయుల సమక్షంలో నిరాడంబరంగా తాము పెళ్ళి చేసుకోబోతున్నామని అమీర్ ఖాన్ తెలిపారు. కనుక తమ జంటకు అందరి ఆశీర్వాదాలు కావాలన్నారు. మా వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని అందరూ దీవించండని కోరారు.
అమీర్ ఖాన్ మొదట రీనా దత్తాని పెళ్ళి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత విడిపోయారు. తర్వాత కిరణ్ రావుతో ప్రేమలో పది ఆమెను పెళ్ళి చేసుకున్నారు. కానీ మళ్ళీ విడిపోయారు. తర్వాత గౌరీ స్ప్రాట్‌తో రెండేళ్ళుగా డేటింగ్ చేసి ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నారు.
అయితే అమీర్ ఖాన్ వయసు ఇప్పుడు 61 కాగా ఆమె వయసు 47. ఈ వయసులో వారే యువ జంటలను ఆశీర్వదించాలి. కానీ తమని ఆశీర్వదించమని అమీర్ ఖాన్ అడుగుతున్నారు!