ఈ నెల బాక్సాఫీస్ బంగారం వసూళ్ళు: 80.87 కోట్లు

July 02, 2026


img

సమంత ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద రెండో వారంలో కూడా మంచి వసూళ్ళతో సాగుతోంది. 

ఇప్పటి వరకు 11 రోజుల్లో ఈ సినిమా భారత్‌లో రూ.49.85 కోట్ల నెట్‌, గ్రాస్ రూ.57.72 కోట్లు కలెక్షన్స్ నమోదు చేసింది. మా ఇంటి బంగారం ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా జోరు కొనసాగిస్తోంది. ఈ 11 రోజులలో రూ.23.15 కోట్ల గ్రాస్ సాధించింది. 

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ‘మా ఇంటి బంగారం’ 11 రోజుల్లో మొత్తం రూ.80.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారు ప్రభంజనం కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో కలిపి ఇప్పటి వరకు రూ.42.96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కనుక మూడో వారం ముగిసేసరికి 50 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. 

ఇతర రాష్ట్రాల్లో కూడా బంగారం వసూళ్ళు బాగానే ఉన్నాయి. కర్ణాటకలో రూ.8.86 కోట్లు, తమిళనాడులో రూ.4.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 

ఇక సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సక్సెస్ మీట్‌లో నిర్మాత, సమంత భర్త రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం-2’ ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. 


Related Post

సినిమా స‌మీక్ష