హైదరాబాద్‌లో 20 వేల మంది విదేశీయులు.. అంతేనా?

July 01, 2026


img

భారత్‌లోకి పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాల నుంచి అక్రమంగా ప్రవేశించి స్థిరపడినవారు బహుశః లక్షల సంఖ్యలో ఉంటారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో బిజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ హయంలో రాష్ట్రంలో అక్రమంగా వలసలు వచ్చి స్థిరపడినవారిని గుర్తించి వెనక్కు తిప్పి పంపేస్తోంది. కానీ వారిని గుర్తుపట్టడం, తిప్పి పంపడం రెండూ చాలా కష్టమే. 

పశ్చిమ బెంగాల్ తర్వాత దేశంలో హైదరాబాద్‌లో ఎక్కువ మంది అక్రమంగా నివసిస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఇదివరకే ఆరోపించారు. కానీ ఇంతవరకు వారిని తిప్పి పంపలేకపోయాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 

కేవలం ఇమ్మిగ్రేషన్ అధికారుల లెక్కల ప్రకారమే హైదరాబాద్‌లో 21,563 మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారు. వారిలో 9,500 మంది రోహింగ్యాలు, 6,400 మంది నేపాల్, 3,900 మంది బంగ్లాదేశ్,  785 మంది సోమాలియా, 432 మంది సూడాన్, 225 మంది యెమెన్ దేశానికి చెందినవారున్నారు. వీరుకాక పాకిస్తాన్‌ నుంచి వచ్చి స్థిరపడినవారి సంఖ్య కూడా భారీగానే ఉండవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వారిలో చాలా మంది స్థానిక నేతల సాయంతో ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు కూడా సంపాదించుకున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.

కనుక కేంద్ర ఎన్నికల కమీషన్‌ చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో అటువంటి అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు తిప్పి పంపించగలిగితే భారత్‌కి భారం తగ్గుతుంది. 


Related Post