అవును. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్)కి అప్పగించబోతున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అనలాగ్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీలతో అవగాహనా ఒప్పందం చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈవో అలెక్స్ కీప్‌మన్, మేఘా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.కృష్ణారెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ రద్దీ, వాతావరణంలో మార్పులు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాల రాకపోకలు తదితర అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్‌ని ఏఐ నియంత్రిస్తుంది. ముందుగా నగరంలో ఎంపిక చేసిన జంక్షన్లలో ఏఐ ద్వారా ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే నగరంలో అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్‌ని ఏఐకి అనుసంధానిస్తారు.
ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా భూగర్బంలో ఉండే త్రాగునీరు, డ్రైనేజి పైపుల పగుళ్ళలో లీకేజీలను ముందే గుర్తించవచ్చు. ఇంకా దీంతో పలు ప్రయోజనాలున్నాయని అనలాగ్ సీఈవో అలెక్స్ కీప్‌మన్ తెలిపారు.