అంబాస్ రివెంజ్: తెలుగులో తొలి ఏఐ సినిమా

July 02, 2026


img

తెలుగు సినీ పరిశ్రమ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగానే ఉపయోగించుకుంటునప్పటికీ ఇప్పటి వరకు దాంతోనే పూర్తి సినిమా తీయలేదు. ఆ లోటు తీర్చబోతోంది జయవర్ధన్ మడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అంబాస్ రివెంజ్.’ మహాభారతంలో తనని పెళ్ళాడాలనుకున్న ‘అంబా’ని భీష్ముడు తిరస్కరిస్తాడు. దాంతో ఆమె ఆయనపై పగపట్టి ప్రతీకారం తీర్చుకుంటుంది. 

ఈ పౌరాణిక గాధ ఆధారంగా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా తీశామని జయవర్ధన్ మడి తెలిపారు. ఏఐ ద్వారా రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు.  

ఈ సినిమాకి అవసరమైన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని కాలై విజువల్ స్టూడియోస్ అందిస్తోంది. తెలుగులో  దీనిని నక్కతోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ కలిసి నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో టీజర్‌, ట్రైలర్‌, రిలీజ్‌ డేట్ ప్రకటించనున్నారు.   నిర్మాణం పూర్తయింది.  ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ సాధించగలిగితే దీని స్పూర్తితో తెలుగులో మరిన్ని ఏఐతో రూపొందించిన సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. 


Related Post

సినిమా స‌మీక్ష