మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ పూర్తయ్యి దాదాపు రెండేళ్ళు కావస్తున్నా విడుదల కాకపోవడంతో ఎప్పటికైనా విడుదలవుతుందా లేక సైలంట్‌గా అటకెక్కించేశారా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఎట్టకేలకు ఈ అక్టోబర్ 16న విడుదల కాబోతోంది.
ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, సురభి పురాణిక్, ఇషా చావ్లా, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, రాజీవ్ కనాకాలం సౌరవ్ లోకేష్ నటించారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, సంగీతం: కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి భారీ బడ్జెట్‌తో విశ్వంభరని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కించారు.