హైదరాబాద్‌లో ప్రైవేట్ విమానం వేలం!

July 04, 2026


img

దేశంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ విమానాన్ని ఈడీ అధికారులు ఈ-వేలం ద్వారా విక్రయించారు. హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేలంలో ఫాల్కన్ గ్రూప్‌కు చెందిన హాకర్ 800ఏ బిజినెస్ జెట్ రూ.3 కోట్లకు అమ్ముడైంది.

ఫాల్కన్ గ్రూప్ వ్యవస్థాపకుడు అమర్‌దీప్ కుమార్‌, అతని సోదరుడు సందీప్ కుమార్‌, ఆ సంస్థ సీఈవో ఆర్యన్ సింగ్, ఆ సంస్థ చార్టడ్‌ అకౌంటెంట్ శరద్ చంద్ర లోష్నీవాల్ కలిసి  క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి పెట్టుబడిదారుల నుంచి రూ.792 కోట్లు మోసపూరితంగా కాజేశారు. ఈ కేసులోనే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా 2025 మార్చి 7న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఈ విమానాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పోరేషన్ లిమిటెడ్ అధ్వర్యంలో ఈడీ అధికారుల సమక్షంలో ఆ జెట్ విమానాన్ని వేలం వేశారు.


Related Post