పోలీస్ శాఖలో 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌

July 04, 2026


img

తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మొన్న మూసీ ప్రాజెక్టు, రాష్ట్రంలోని టిమ్స్ హాస్పిట లో  కలిపి మొత్తం 6,425 పోస్టుల భర్తీకి మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా పోలీస్ శాఖలో 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఒకేసారి 11,425 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్స్ వరుసగా విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ ప్రకటన చాలా సంతోషం కలిగిస్తుంది. 

పోలీస్ శాఖలో 10 విభాగాలలో కలిపి మొత్తం 5,000 పోస్టుల భర్తీ చేయబోతోంది. 

పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 పోస్టులు,

ఆర్మ్ రిజర్వ్ కానిస్టేబుల్: 1,052 పోస్టులు, 

సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్): 148 పోస్టులు, 

సబ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్మ్ రిజర్వ్):14 పోస్టులు, 

రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (టీజీఎస్పీ): 12 పోస్టులు, 

సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్ సిపీఎల్): 3 పోస్టులు, 

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌పీబీ): 23 పోస్టులు, 

పోలీస్ కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్): 24 పోస్టులు, 

పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్-పీటీవో): 20 పోస్టులు, 

మెకానిక్ పీటీవో: 7 పోస్టులు. 


Related Post