ఈ నెల 13 నుంచి 21 వరకు ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగబోతున్నాయి. కనుక ఇప్పటికే చాలా మంది విద్యార్ధులు ఫీజు చెల్లించి పరీక్షలకు సిద్దం అవుతున్నారు. కానీ వివిధ కారణాల వలన సకాలంలో ఫీజు చెల్లింఛలేకపోయిన విద్యార్ధుల కోసం ఇంటర్ బోర్డు ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ఈ పరీక్షలు వ్రాయాలనుకునే ఇంటర్ ప్రధమ, ద్వితీయ విద్యార్ధులు ఈ గడువులోగా ఆలస్య రుసుము రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. థియరీ పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ నెల 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.