రోమాంచకం ఫస్ట్ గ్లిమ్స్‌.. ఇలా ఉందేమిటి?

January 01, 1970


img

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తొలిసారిగా నిర్మాతగా మారి తీస్తున్న సినిమా ‘రోమాంచకం.’ ఆయన సోదరుడు ప్రణయ్‌ రెడ్డి వంగా భద్రకాళి పిక్స్చార్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాతో వేణుగోపాల్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. 

రోమాంచకం ఫస్ట్ గ్లిమ్స్‌ నిన్న విడుదల చేశారు. ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగ భాగస్వామిగా ఉన్నందున దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఫస్ట్ గ్లిమ్స్‌ అంచనాలకు తగ్గట్లు లేదనిపిస్తుంది.   

ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్‌, అనంతిక సనీల్ కుమార్‌ జంటగా చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: వాసుకి వైభవ్‌, కెమెరా: పవన్ పప్పుల చేస్తున్నారు. త్వరలోనే రోమాంచకం రిలీజ్‌ డేట్ ప్రకటిస్తారు.    


Related Post

సినిమా స‌మీక్ష