వారిని కాపాడితే మీ మొబైల్ గోవిందా!

July 07, 2026
img

హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలుచోట్ల మొబైల్ ఫోన్ల దొంగలు రెచ్చిపోతున్నారు. అయితే ఈసారి ఎవరూ ఊహించని రీతిలో మన సాయం తీసుకుంటున్నట్లు నటిస్తూనే మన జేబులో మొబైల్ ఫోన్ కొట్టేసి పారిపోతున్నారు.

ఏవిధంగా అంటే మనం రోడ్డుపై నడుచుకు వెళుతున్నప్పుడు, ఓ వ్యక్తి బైక్ లేదా స్కూటీపై మన ముందుకు వచ్చి బండి సంజయ్‌ స్లిప్ అయ్యి కిందపడిపోతున్నట్లు నటిస్తాడు. మనం వెంటనే అతనికి బండిని పైకి లేపేందుకు తప్పక సాయపడతాము.

అదే సమయంలో సమీపంలోనే ఉన్న మరో వ్యక్తి కూడా పరుగున వచ్చి సాయం చేస్తున్నట్లు నటిస్తూ మన జేబులో ఫోన్ కొట్టేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అదే బైక్ మీద పారిపోతారు.

వాళ్ళు వెళ్ళిపోయాక కానీ మనకు తెలీదు మన జేబులో మొబైల్ ఫోన్ వాళ్ళు కొట్టేశారని. అప్పుడు లబోదిబోమని ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు.

కనుక ఈసారి మీ ముందుకు వచ్చి ఎవరైనా బండితో కింద పడిపోతున్నట్లు నటిస్తే సాయపడొద్దు. ముందు మీ మొబైల్ ఫోన్‌తో ఆ వ్యక్తి, బండి నంబర్ ప్లేట్ ఫోటోలు తీయండి. కుదిరితే నలుగురిని పిలిచి అతనిని, అతని తోడు దొంగని పట్టుకొని పోలీసులకు అప్పగించండి.

ఇలాంటి దొంగతనాలు నగరంలో జరుగుతున్నాయి. దొంగలు ఏ విధంగా మీ మొబైల్ ఫోన్ కొట్టేస్తారో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. 

Related Post