కవితకు ఢిల్లీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

July 07, 2026


img

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్‌ పార్టీ పేరు మార్చుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన సూచనను సవాలు చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసి సవాలు చేశారు. 

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకే షాక్ ఇచ్చింది. ఎన్నికల సంఘం ముందు అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశాలను వినియోగించుకోకుండా నేరుగా కోర్టుకు రావడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈసీ నుంచి నోటీసు అందుకున్నందున ముందుగా దానికి పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని, కానీ నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. ముందుగా ఎన్నికల సంఘం ఎదుట మీ వాదనలు వినిపించి, ఆ తర్వాత అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కల్వకుంట్ల కవిత ఇది ఊహించని సమాధానమే. 


Related Post