యాక్షన్ మోడ్‌లో చిరు-బాబి సినిమా

July 07, 2026


img

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి చిన్న అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తోంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారని తెలిపింది. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. 

ఈ యాక్షన్ సన్నివేశాలు అభిమానులు ఆశించే స్థాయిలో ఉండేలా దర్శకుడు బాబీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇవి ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపింది. 

చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి #158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష