ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్‌..

July 07, 2026


img

బీఆర్ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, ఏఐజీ ఆస్పత్రికి వెళ్ళారు. అయితే అనారోగ్యంతో లేదా వైద్య పరీక్షల కోసమో కాదు. ఆ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న తన మనుమడు హిమాన్షుని పరామర్శించేందుకు వెళ్ళారు.    

ఆయన మనవడు, కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు నిన్న స్నేహితులతో కలిసి ఆడుకొంటూ ఉండగా ముక్కుకి గాయమైంది. దాంతో అతనిని ఏఐజీ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్‌ కూడా అతనిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్ళారు. 

తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని  హిమాన్షు సోషల్ మీడియా ద్వారా తన బంధుమిత్రులకు తెలియజేశాడు.


Related Post