మలయాళ సినిమా ‘ఇదయం మురళి’ తెలుగులో ‘హృదయం మురళి’గా విడుదల కాబోతోంది. విశేషమేమిటంటే ఈ సినిమాలో సంగీత దర్శకుడు తమన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇదొక రొమాంటిక్ మ్యూజికల్ జర్నీ అని ట్రైలర్‌తో చెప్పేశారు.
ఈ సినిమాలో అథర్వా, ప్రీతి ముకుందన్, కయాడు లోహర్, నిహారిక, ఫహాద్ ఫాసిల్, తమన్, రక్షన్, ద్రావిడ్ సెల్వం, ఏంజెలిన్, అంజు కురియన్, సుధాకర్, యశశ్రీ, జోనితా గాంధీ, నట్టి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ,
ఈ సినిమాకు దర్శకత్వం: ఆకాశ్ బాస్కరన్; సంగీతం: తమన్; పాటలు: వివేక్; కెమెరా: మనోజ్ పరమహంస, సీహెచ్ సాయి; నృత్య దర్శకురాలు – అనుషా విశ్వనాథన్; ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్ చేశారు. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కాబోతోంది.